బుధవారం, ఆగస్టు 28, 2013

మిస్సవకూడని 2 సినిమాలు

అంతకుముందు ఆ తరువాత : 
గ్రహణం, మాయాబజార్, అష్టాచెమ్మ, గోల్కొండ హైస్కూల్. ఇపుడు ఈ సినిమా తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ మంచి అభిరుచిగల తెలుగు దర్శకులలో ఒకరు. తీసుకున్నది రొటీన్ సబ్జెక్ట్ (ప్రేమ, లివ్ఇన్ రిలేషన్ షిప్) అయినా కూడా దానిని తెరకెక్కించడంలో తెలుగుదనాన్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు. చాలా తెలుగు కుటుంబాలు ఎదుర్కొనే సాధారణ సమస్యలను డిస్కస్ చేస్తూ మంచి మంచి సంభాషణలతో చక్కని కారెక్టరైజేషన్స్ తో వాటికి తగిన నటీనటులతో రొటీన్ కి భిన్నంగా సహజంగా కనిపించేలా తీర్చిదిద్దినందుకు ప్రోత్సహించడానికైనా ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలి. కళ్యాణి కోడూరి (మాలిక్) సంగీతం ఆకట్టుకుంటుంది. 

హీరో కొంచెం నెగటివ్ మార్కులు తెచ్చుకున్నా హీరోయిన్ పూర్తి పాజిటివ్ మార్క్స్ చేజిక్కించుకుంటుంది. చక్కటి తెలుగుమాట్లాడే మన పక్కింట్లో ఉండే ఓ అందమైన తెలుగమ్మాయిని తీస్కుని తన కారెక్టర్ ని అలాగే ప్రజెంట్ చేయడం చాలాచాలా బాగుంది. తన నటనకూడా సింపుల్ గా సహజంగా ఉంది. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, రోహిణి, మధుబాల, రవిబాబు అందరూ కూడా ఆకట్టుకునే నటనని ప్రదర్శించారు వాళ్ళని చూస్తుంటే మనం ఎవరో ఒకరి ఇంట్లో రోజూ చూసే పాత్రలే ఇవి అనిపిస్తాయి. 

సాహిత్య పిపాసి అయిన మోహనకృష్ణ తన సినిమాలో సంభాషణలు కూడా చాలా బాగా రాసుకున్నాడు. అష్టాచెమ్మతో పోలిస్తే హాస్యం పాళ్ళు తగ్గినా తీసుకున్నది సీరియస్ సబ్జెక్ట్ కనుక ఈ ట్రీట్మెంట్ ఈ కథకి బాగా సూటయింది. నాకైతే ఒక మంచి పుస్తకం చదివిన ఫీల్ వచ్చింది. తీసుకున్నది యూత్ సబ్జెక్ట్ బూతుకామెడీని ద్వంద్వార్ధాలని ఇరికించే అవకాశమున్న సబ్జెక్ట్ అయినా కూడా చాలా డీసెంట్ గా ప్రజంట్ చేశాడు. 

ఒక అద్భుతమైన కళాఖండం కాకపోవచ్చు ఒకటీ అరా లోపాలుండవచ్చు కానీ మంచి సినిమాలని ప్రోత్సహించే అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిన సినిమా అంతకుముందు ఆ తరువాత. ముఖ్యంగా కొత్తగా పెళ్ళి చేసుకోబోతున్న వారు చేసుకున్నవాళ్ళు ఒకసారి తప్పక చూడాల్సిన సినిమా.
 
మద్రాస్ కెఫె:
విక్కీడోనార్ సినిమాతో వివాదాస్పదమైన సబ్జెక్ట్ ఎన్నుకున్నా కూడా దానిని హృద్యమైన కథనంతో ప్రజంట్ చేసి ఆకట్టుకున్న దర్శకుడు సూజిత్ సర్కార్ సినిమా మద్రాస్ కెఫె మొన్న ఇరవైమూడున విడుదలైంది. బాలీఉడ్ సినిమాల్లో సాధారణంగా కనిపించే డ్రమటైజేషన్, ప్రేమ, కామెడీ, సబ్ ప్లాట్స్ లేకుండా తనేం చెప్పాలనుకుంటున్నాడో అదే సబ్జెక్ట్ నుండి డీవియేట్ కాకుండా విస్తృతమైన రీసెర్చ్ చేసి హాలీఉడ్ స్టైల్లో తెరకెక్కించిన సినిమా మద్రాస్ కెఫె. పాటలు కూడా లేకుండా ప్రారంభం నుండి చివరి వరకూ కథకు కట్టుబడి చిత్రీకరించిన చిత్రం. సినిమాటోగ్రపీ అత్యద్భుతంగా ఉంది యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా చిత్రీకరించారు, బాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. 

సినిమా మొదటి సగం కథలోకి పూర్తిగా ఎంటర్ అయినట్లు అనిపించక కొంచేం స్లోగా నడుస్తుంది అనిపించినా రెండో సగంలో మాత్రం మెరుపు వేగంతో సాగుతుంది తెలిసిన కథే అయినా థ్రిల్ మిస్ అవకుండా చక్కగా చిత్రీకరించారు చివరి అరగంట అయితే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ త్రిల్లర్ అని చెప్పచ్చు రా ఆఫీసర్ తో పాటు మనం కూడా టెన్షన్ పడుతూ ఉంటాము. ఫేమస్ కాన్స్పిరసీగా చాలామందికి తెలిసిన కథే అయినా ఎటువంటి బయాస్ చూపించకుండా మైన్యూట్ డీటేయిల్స్ కూడా కవర్ చేస్తూ రియలిస్టిక్ గా తెరకెక్కించిన చిత్రం ఇది. పొలిటికల్ థ్రిల్లర్స్ పై మీకు ఏమాత్రం ఆసక్తి ఉన్నా మిస్ అవకుండా చూడాల్సిన సినిమా మద్రాస్ కెఫె.

6 కామెంట్‌లు:

  1. మద్రాస్ కేఫ్ చూసాను.ఇంద్రగంటి సినిమా చూడాలండీ..చూడాలనిపించేల రాసారు :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ రిషి గారు. తప్పకుండా చూడండి హి విల్ నాట్ డిజప్పాయింట్ యూ.

      తొలగించండి
  2. మద్రాస్ కేఫ్ చూడడం కుదరలేదుగాని.. అంతకుముందు ఆ తరువాత మాత్రం బాగుందంది... మీ రివ్యు కూడా.... :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ నాగశ్రీనివాస గారు. మీకు పొలిటికల్ డ్రామాస్ ఇష్టమైతే మద్రాస్ కేఫ్ టివీల్లో టెలికాస్ట్ అయినపుడైనా చూడండి బాగుంటుంది.

      తొలగించండి
  3. ఖచ్చితంగా చూస్తను.. అది తెలుగులోకి డబ్ అయిందాండీ

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.